calender_icon.png 12 December, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి

12-12-2025 09:40:45 PM

వెలుగుపల్లి వార్డు మెంబర్ గుండా శ్రీనివాస్ గుప్తా

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాల్లోని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని వెలుగుపల్లి వార్డు మెంబర్ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ గుండా శ్రీనివాస్ గుప్తా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి చేరే విధంగా నాయకుడు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నాపై నమ్మకంతో వార్డు మెంబర్ గా గెలిపించినందుకు వెలుగుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు బంధువులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.