12-12-2025 08:58:07 PM
నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ
పాల్వంచ,(విజయక్రాంతి): సఖి మహిళా మండలిలో ఉన్నటువంటి బత్తిని నాగలక్ష్మి, పావని ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను గమనించిన సఖి మహిళా మండలి వారికి నిత్యవసర వస్తువులు, కూరగాయలు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ప్రతి నెల వారికి 25 కేజీల బియ్యం డిక్కీ ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. బత్తిని నాగలక్ష్మి, పావని తల్లి , కూతురు వారు కుటుంబ పెద్ద లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఫౌండర్ అండ్ చైర్మన్ దృష్టికి అనేకసార్లు తీసుకురావడం జరిగినది.
వారి ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలను గమనించినటువంటి సఖి మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. పాల్వంచలో సఖి మహిళా మండలి మంచి టీం ఏర్పడినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డివిజన్ అధ్యక్షురాలు తెల్లం రాణి, పాల్వంచ డివిజన్ ఉపాధ్యక్షురాలు పాల సృజన, పాల్వంచ డివిజన్ జాయింట్ సెక్రటరీ కీర్తన తదితరులు పాల్గొన్నారు