12-12-2025 09:43:51 PM
హనుమకొండ,(విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ అధ్యక్షుడు సాజీద్ పై దాడి చేసిన ఘటనలో మంత్రి కొండ సురేఖ, మురళీధర్ రావుల అనుచరుడు నవీన్ రాజు పై ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ రాజు తీరుపై వాట్సాప్ గ్రూపులో ఆడియోలు పెట్టినందుకు తనను కత్తిలో బెదిరించి, దాడి చేశారని బాధితుడు సాజిద్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అతనిపై బిఎన్ఎస్ సెక్షన్లు 118, 296, 351 కింద నవీన్ తో పాటు అతని అనుచరులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.