25 June, 2026 | 5:11 PM

గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలి

25-06-2026 04:37 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): మండలంలోని గ్రామ కార్యదర్శులు గ్రామంలో స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలని ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ అన్నారు. గురువారం ఖానాపూర్  లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడుతుందని, ప్రధానంగా చదువుకునే విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లు, ఇతర సౌకర్యాలు అందకుండా పోతున్నాయని కార్యదర్శులు దూరప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహించడం వల్ల సకాలంలో ప్రజలకు సేవలు అందడం లేదని వారు ఆరోపించారు. ఇకనైనా కార్యదర్శులు స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు, ఈ మేరకు స్థానిక ఎంపీడీవో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం సహాయ కార్యదర్శి భూక్య సురేందర్, సరూప లు ఉన్నారు.