25 June, 2026 | 5:15 PM

బండరాయిని.. పులిగా మార్చి పూజలు

25-06-2026 04:39 PM

ఉట్నూర్, జూన్ 25( విజయక్రాంతి ): ఈ చిత్రాన్ని చూస్తే అడవి నుండి పులి  బయటకు వచ్చి వేట కోసం కూర్చున్నట్లు  కనిపిస్తుంది కదూ.. కానీ అది నిజమైన పులి కాదు.. మొహరం పండుగ సందర్భంగా అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం  లోని బుడ్డి గూడా  గ్రామ కొలం గిరిజనులు బండరాయిని  తీసుకువచ్చి  పులి ఆకారంలో తీర్చిదిద్దడంతోపాటు  పులి రంగును  వేశారు. పులిసారలు .. పులి మచ్చలు వేసి.. మొహరం పండుగ సందర్భంగా  బండరాయి పులికి  కొలం జీవితంలో ప్రత్యేక పూజలు చేస్తూ ముక్కులు తీర్చుకుంటున్నారు. బండరాయిని పులిగా మార్చిన చిత్రమే ఇది..