10 March, 2026 | 2:29 AM

సమస్యలు పరిష్కరించండి

10-03-2026 12:31 AM

ఎమ్మెల్యే కడియంకు గ్రామస్తుల వినతి

జనగామ, మార్చి 9 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, మహిళా స మాఖ్య భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడంతో పాటు గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట, వెంకటేశ్వర పల్లి గ్రా మస్తులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి వినతి పత్రం అందించారు. వెంకటేశ్వర పల్లి లో గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

అదేవిధంగా పల్లగుట్టలో మహిళా భవనం నిర్మించాలని, రెండు గ్రామాల రైతులు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో మక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, వెంకటాద్రి పేట మాజీ ఎంపిటిసి వెన్నకూస కుమార్, రెండు గ్రామాల రైతులు, పాల్గొన్నారు.