09-01-2026 12:48:50 AM
వేములవాడ, జనవరి 8 (విజయక్రాంతి): గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలో శ్రీ కృష్ణ బలరామ యాదవ సంఘం ఆధ్వర్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన యాదవ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులకు ఆత్మీయ సన్మానం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందన్నారు. రాజన్న ఆలయ విస్తరణకు రూ.150 కోట్లతో పనులు జరుగుతున్నాయని, పట్టణాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి సంతోష్ యాదవ్, జెకె యాదవ్, సంఘ స్వామి యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, తిరుపతి బాబు యాదవ్, సిర్రం ప్రసాద్ యాదవ్, మామిండ్ల పర్శరాములు యాదవ్, కాశవేని మహేష్, మల్లేశం, సత్తయ్య యాదవ్, జక్కుల మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.