09-01-2026 12:48:15 AM
కాంగ్రెస్ పార్టీ నేత పంజగారి ఆంజనేయులు
మేడ్చల్ అర్బన్, జనవరి 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అత్వెళ్లి లో నూతనంగా రేషన్ ధరల దుకాణాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజగారి ఆంజనేయులు జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నటు వంటి రేషన్ ధర దుకాణాన్ని స్వర్ణలత పేరుతో ఇన్చార్జిగా కొనసాగుతుందని దాని స్థానంలో మరో రేషన్ తల దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరినట్లు చెప్పారు.
గత 15 సంవత్సరాల నుండి ఒకే కుటుంబానికి చెందిన వారు రేషన్ షాప్ నడిపించడం సరికాదని ఇప్పుడు ఉన్నటు వంటి స్వర్ణలత పేరుతో తొలగించి నిరుద్యోగులైన యువతి యువకులకు అవకాశం కల్పించాలని ఆంజనేయులు తెలిపారు. ఈ నేపథ్యంలో అత్వెల్లిలో రేషన్ ధరల దుకాణం ఏర్పాటు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ తోపాటు ఆర్డీవోకు విజ్ఞప్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.