09-01-2026 12:49:58 AM
రాజేంద్రనగర్ సర్కిల్ హైదరాబాద్‌కు మార్చొద్దంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్‌ఎస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జి పి.కార్తీక్ రెడ్డి
నిరసన దీక్షా శిబిరాన్ని భగ్నం చేసిన పోలీసులు
రాజేంద్ర నగర్ జనవరి 8, ( విజయక్రాంతి): రాజేంద్రనగర్ సర్కిల్ ను హైదరాబాద్ లో కలపడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని బిఆర్‌ఎస్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జి పి. కార్తీక్‌రెడ్డి విమర్శించారు. అంతే కాకుండా చారిత్రాత్మకమైనటువంటి రాజేంద్రనగర్ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గురువారం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బి ఆర్ ఎస్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తాలో దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బి ఆర్‌ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి పి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్ ను హైదరాబాదులో కలపొద్దని ఎప్పటిలాగే సైబరాబాద్ లోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దిక్షా కార్యక్రమానికి ముందుగా కార్తీక్ రెడ్డి చౌరస్తా లో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ కు మేము అభ్యర్థించేది ఒక్కటే రాజేంద్రనగర్ సర్కిల్ హైదరాబాదులో కలిపే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పార్టీ నాయకులు కొలన్ సుభాష్ రెడ్డి ,డి.రమేష్ ముదిరాజ్ , పోరెడ్డి ధర్మారెడ్డి , జీవన్ దాస్ , జె. చిత్తరి, వనం శ్రీరామ్ రెడ్డి , నోముల రాము యాదవ్, అక్యం రాఘవేందర్ యాదవ్, ఎడ్లకాడి సూర్యం, కే.లక్ష్మీ రాజ్, సరికొండ దుర్గేష్ రాజేష్ యాదవ్, ముక్రం ఖాన్ జహీర్ ఖాన్ నయీముద్దీన్, గుమ్మడి కుమార్, శివారెడ్డి , ప్రసన్న సరితా, పద్మ, సుగుణ, కొంపల్లి జగదీష్ చిరంజీవి బాలరాజ్ యాదవ్,నరేష్ యాదవ్ జనాపూర్ సునీల్ ,మహేష్ గోపాల్ నాయక్ అశోక్ ,నాగని సురేష్, మనోహర్,సుమన్,తదితరులు పాల్గొన్నారు.