calender_icon.png 16 December, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన వినయ్‌రెడ్డి

15-12-2025 12:29:24 AM

ఆలూరు, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్‌రెడ్డి. మచ్చర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాగవతుల లింగవ గారిసర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించిన వినయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మచ్చల గ్రామంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు గాని ఎవరికి మంజూరు చేసామని ఇంకా మంజూరు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేయూత అందిస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భాగవతల లింగవ్వ కి ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంకా ఆలూరు మండల నాయకులు మచ్చర్ల గ్రామ నాయకులు జితేందర్, డైరెక్టర్ ఉషన్న, సంజీవ్, రమేష్, మల్లేష్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు జిమ్మీ రవి, రాజు భాయ్, రాజు భాయ్, డైరెక్టర్ వాసు, భూపేందర్, నటరాజ, శ్రీకాంత్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.