22 July, 2026 | 2:09 AM

చీకటి ఒప్పందాలపై కన్నెర్ర

22-07-2026 01:38 AM
  1. భారత్-అమెరికా ఒప్పందంపై రైతు సంఘాల వ్యతిరేకత
  2. దేశ్ బచావో మోర్చాను అడ్డుకున్న పోలీసులు
  3. ఒప్పందంపై నిర్ణయం తీసుకోలేదుః మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ, జూలై 21: రైతుల ధర్నా, నిరసనలతో ఢిల్లీ పరిసరాలు దద్దరిల్లాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశ్ బచావో మోర్చా పిలుపు మేరకు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయత్‌కు వస్తున్న ఆయా రాష్ట్రాల రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో, పలు ప్రాంతాల్లో రైతులు బైఠాయింపు, నిరసన, ఆందోళనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

ఒప్పందం కొన్ని వస్తువులకే పరిమితం కాదని, వ్యవసాయం, పాడి, పరిశ్రమ, డిజిటల్ వాణిజ్యం, ఇ--కామర్స్, ప్రభుత్వ కొనుగోళ్లు, మేధో సంపత్తి హక్కులు, సేవల రంగం వంటి వాటిని కూడా ఇది పరిధిలోకి తీసుకోవచ్చని బీకేయూ, డీబీఎం, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత రైతుల స్వప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, తీవ్ర నష్టం తప్పదని వాపోయారు. భారతీయ రైతులు విదేశీ రైతులతో పోటీ పడటం కష్టం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘దేశ్ బచావో మోర్చా’ పిలుపుతో ‘కిసాన్ మహాపంచాయత్’లో పాల్గొనేందుకు హరియాణా, చండీగఢ్, పంజాబ్, యూపీకి చెందిన బీకేయూ, డీబీఎం రైతులు, రైతు సంఘాల నాయకులు, రైతులు వేలాది మంది మంగళవారం ఢిల్లీకి వస్తుండగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ సరిహద్దుల వెంట అడ్డుకొని అరెస్టు చేశారు. ఢిల్లీ - మీరట్ హైవే కాశీటోల్‌ప్లాజా, శంభూ సరిహద్దుల వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అమెరికాలో వ్యవసాయ రంగానికి, రైతులకు అక్కడి ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌లు కల్పిస్తుందన్నారు. అక్కడ తయారైన చౌకైన ఉత్పత్తులు భారతీయ మార్కెట్‌లోకి తీసుకువస్తే దేశ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ల కు, పోలీసులకు మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  పోలీసులు, హరియాణా మంత్రి శ్యామ్‌సింగ్ రాణా తదితరులు రైతులకు నచ్చజెప్పడంతో నిరసనలు, ఆందోళనలు విరమించారు. 

కేంద్ర ప్రభుత్వం హామీ..

భారత-అమెరికా ఒప్పందం విషయంలో దేశ వ్యవసాయ, రైతు ప్రయో జనాల విషయంలో రాజీ పడబోమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్ర కటించారు. సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులను చర్చల పరిధి బయటే ఉంచామని స్పష్టం చేశారు. ఇరు దేశాలకు సమాన ప్ర యోజనం చేకూరేలా, భారతదేశపు ‘రెడ్ లై న్స్’ దాటకుండా ఉంటేనే ఒప్పందంపై సం తకం చేస్తామని, తొందరపడి ఎలాంటి నిర్ణ యం తీసుకోమని స్పష్టం చేశారు.