సుప్రీంకోర్టులో వర్చువల్ హియరింగ్స్
16-05-2026 12:31 AM
- సోమ, శుక్రవారాలు, సెలవు దినాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే కేసుల విచారణ
- ఇంధన పొదుపులో భాగంగా నిర్ణయం
న్యూఢిల్లీ, మే 15: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఇం ధన పొదుపు కోసం పీఎం నరేంద్ర మోదీ ఇ చ్చిన పిలుపునకు సుప్రీంకోర్టు కేసుల విచారణ వర్చువల్‌గా చేపట్టాలని కీలక నిర్ణ యం తీసుకున్నది. ఇంధనాన్ని ఆదా చేస్తూనే పాల నా సామర్థ్యాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకున్నది.
సోమ, శుక్రవారాలు, సెలవు దినాల్లో కేసుల విచారణ కేవలం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వా రా చేపట్టనుంది. అలాగే ఇంధన వృథాను అరికట్టడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం అధికారిక ప్రయాణాల కోసం కార్-పూలింగ్ (వాహనాలను పంచుకోవడం) చేయడాకి అం గీకరించారు. అలాగే కోర్టు రిజిస్ట్రీ సిబ్బంది లో 50 శాతం మందికి వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించారు.






