3 July, 2026 | 9:44 PM

Breaking News

డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •  

ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శన

04-04-2025 12:00 AM

కామారెడ్డి, ఏప్రిల్ 3 ( విజయ క్రాంతి ):   కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల లో గురువారం 12 వ. తెలంగాణ ఎన్సిసి బెటాలియన్ కమాండింగ్  ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కర్నల్ విష్ణు పి.నాయర్ కళాశాల ఎన్సిసి యూనిట్ ను  సందర్శించారు.  ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్, ఎన్సిసి ఏ.ఎన్.ఓ లెఫ్ట్నెంట్ డాక్టర్ ఏ.సుధాకర్ ఉన్నారు.  కర్నల్ విష్ణు పి. నాయర్ ఎన్సిసి  విద్యార్థులకు ఆర్మీ విషయాలపై అవగాహన కల్పించారు. ఎన్సిసి విద్యార్థుల జాతీయస్థాయిలో  ప్రతిభ పాఠవాలు, ఆర్డీలలో విద్యార్థుల అసాధారణ ప్రతిభ గుర్తించిన అన్ని క్యాంప్ యూనిట్ లలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి విద్యార్థులు  మెరుగైన ప్రదర్శన కనపరుస్తున్నందుకు ఏ.ఎన్.ఓ డాక్టర్ ఏ. సుధాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.