calender_icon.png 8 August, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యం.. మా బాధ్యత

08-08-2025 12:11:56 PM

శ్రీరామ కాలనీ నూతన కమిటీ సభ్యులను సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): శ్రీరామ కాలనీలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంమే మీ లక్ష్యంగా భావించినప్పుడు పరిష్కరించే బాధ్యత మేము  తీసుకుంటామని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Former Municipal Chairman Anand Goud) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ స్వగృహంలో శ్రీరామ కాలనీ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరా తీశారు.

విడతలవారీగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోతు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుదామని వారికి భరోసా కల్పించారు. ఐక్యంగా ఉండాలని ఎలాంటి వేషజాలకు పోకూడదని సూచించారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కాలనీ అభివృద్ధికి శాయశక్తులుగా కృషి  చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని కాలనీలో సిసి రోడ్లను వేగవంతంగా చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  శ్రీరామ కాలనీ నూతన కమిటీ అధ్యక్షుడు ఈ. విజయ భాస్కర్, ఉపాధ్యక్షులు హనుమంతు, జనగం సెక్రటరీ వెంకటేష్, ట్రెజరర్ వీరప్రతాప్, జాయింట్ సెక్రెటరీ రమేష్, రవీందర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు వి రాములు, సుభాష్ రెడ్డి, ఇతర కాలనీ వాసులు పాల్గొన్నారు.