03-05-2025 06:39:02 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు గైని రాజలింగం వాలీబాల్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతోనే వాలీబాల్ ను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలాజీ,కోచ్ నాగరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.