లారీని ఢీకొట్టిన వోల్వో బస్సు
27-04-2026 12:40 AM
- 5 మందికి గాయాలు..
- *హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
ఎర్రవల్లి ఏప్రిల్ 26: పీలేరు నుండి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు ఆదివారం కోదండపురం స్టేజి సమీపంలో లారీని వెనుక నుండి బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సాయిశ్రీజ (27), అంజలి (20), మరియు చిన్నారులు ఫయిజా, హైజా తాఫిన్, అని గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హైవే 44 అంబులెన్స్ ద్వారా బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రయాణికులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు






