15 August, 2026 | 1:04 AM

విశ్వకర్మ పంచదాయీ సేవా సంఘం ప్రారంభం

15-08-2026 12:12 AM

హాజరైన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 

సికింద్రాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్య మత్యంతో ము ందుకు సాగుతూ అభివృద్ధి సాధించాలని  ఎమ్మెల్యే  మాధవరం పిలుపునిచ్చారు. విశ్వకర్మ స మాజ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమానికి సేవా సంఘం మరింత తోడ్పాటును అందించాలని మాజీ కార్పొరేటర్ ముద్దం సూచించారు.

ఓల్ బోయిన్పల్లి, హస్మత్పేట్ పరిసర ప్రాంతాల విశ్వకర్మ సో దరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ విశ్వకర్మ పంచదాయీ సేవా సంఘం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వకర్మ సమాజ ఐక్యత, సంక్షేమానికి తోడ్పాటు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే, నర్సింహ యాదవ్‌ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.