ఓటెత్తిన తెలంగాణ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్
72.34% ఓటింగ్‌తో భువనగిరి టాప్
39.17శాతంతో హైదరాబాద్ లాస్ట్
పూర్తి వివరాలు నేడు వెల్లడి
ఓటు హక్కు వినియోగానికి పోటెత్తిన ఓటర్లు
ఈవీఎంల కోసం ౪౪ స్ట్రాంగ్‌రూంలు: సీఈవో వికాస్‌రాజ్
జూన్ 4న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
వివిధ సమయాల్లో పోలింగ్ శాతం
ఉదయం 9 గంటల వరకు 9.48%
ఉదయం 11 గంటల వరకు 24.25%
మధ్యాహ్నం 1 గంట వరకు 40.38%
మధ్యాహ్నం 3 గంటలవరకు 52.34%
సాయంత్రం 5 గంటల వరకు 61.16%
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదరు ఘటనలు మినహా పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగింది. 6 గంటల తర్వాత క్యూ లైన్లలో ఉన్నవారికి రాత్రి 7 గంటలవరకు కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. నక్సల్ ప్రభావిత ౧౩ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం ౭ గంటల నుంచి సాయంత్రం ౪ గంటల వరకే పోలింగ్ నిర్వహించారు.
దాదాపు అన్నిచోట్ల ఓటువేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. 17 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. సాయంత్రం ౫ గంటల వరకు ౬౧.౧౬ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం తుది వివరాలను మంగళవారం వెల్లడిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 66.4 శాతం ఓటింగ్ నమోదైన విషయం తెలిసిందే.
ప్రజలు భారీగా ఓటేశారు: వికాస్‌రాజ్
పోలింగ్ సమయం ముగిసిన తర్వాత సీఈవో వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈసారి ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు వేశారని ప్రశంసించారు. సోమవారం సాయంత్రం ౫ గంటల వరకు భువనగిరిలో 72.34 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు. అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. భువనగిరి, ఖమ్మం, నల్లగొండ, మెదక్, జహీరాబాద్ స్థానాల్లో 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదైందని వెల్లడించారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 47.88 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. వచ్చేనెల 4వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఉదయం పూట పోలింగ్ కాస్త మందకొడిగా సాగినా ఆ తర్వాత పోలింగ్ కేం ద్రాల వద్దకు ఓటర్లు భారీగా చేరుకొన్నారు.
13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటలకే ముగింపు
రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ౧౩ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. అప్పటివరకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ౪ గంటలకే పోలింగ్ ముగించారు.
44 స్ట్రాంగ్ రూంలు
ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని సీఈవో వికాజ్‌రాజు తెలిపారు. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని చెప్పారు. ఈవీఎంలను భద్రపర్చేందుకు ౪౪ స్ట్రాంగ్‌రూంలను ఏర్పాటుచేశామని, వాటికి భారీ బందోబస్తు కల్పించామని వెల్లడించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తున్నామని చెప్పారు. జనరల్ అబ్జర్వర్స్ ఇచ్చే నివేదిక మేరకు ఎక్కడైనా రీ పోలింగ్ అవసరామా లేదా అనేది నిర్ణయిస్తామని తెలిపారు.
కేంద్రం ఆధ్వర్యంలో ఉండే యాప్‌ల ద్వారా ఎన్నికలకు సంబంధించి 415
ఫిర్యాదులు వచ్చాయని, వేర్వేర్ ప్రాంతాల్లో 38 ఎఫ్‌ఐర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 225 ఫిర్యాదులు సీవిజిల్ యాప్ ద్వారా వచ్చాయని తెలిపారు. ఎన్నికల నోఫికేషన్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే ఉందని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని వివరించారు.
సాయంత్రం 5 గంటలవరకు నమోదైన పోలింగ్ శాతం





