06-01-2026 12:48:10 AM
ఖానాపూర్, జనవరి 5 (విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపాలిటీలో అధికారులు ప్రకటించిన ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని దీని వెంటనే మార్చాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం వివిధ రాజకీయ పార్టీల నేతలు తప్పుడు ఓటర్ల జాబి తా సరిచేయాలనే డిమాండ్ చేస్తూ ఖానాపూర్ పట్టణం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ కల్పించుకొని ఖచ్చితంగా లిస్టులు సవరిస్తామని తప్పులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సర్ది చెప్పారు.
అఖిలపక్షం నాయకులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఆందోళన స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ కమి షనర్ సుందర్ సింగ్ వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే ఓటర్ లిస్టు అవకతవకలు సరి చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ రాకముందే సవరించి ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు అంకం మహేందర్, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కొండాడి గంగారావు, నంది రామయ్య, నాయిని సంతోష్, ఎనగందుల నారాయణ, తదితరులు ఉన్నారు.