06-01-2026 12:46:42 AM
ఆదిలాబాద్ ఎంపీ గడం నగేష్
ఖానాపూర్, జనవరి 5 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటి సీట్లు కైవసం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పర్యటించారు. ఈ మేరకు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి సర్పంచులను వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. రాజురా, రంగపేట, బీర్ నంది, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.
అనంతరం ఎంపీని ఖానాపూర్ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ,ఆలయ కమిటీ చైర్మన్ కొక్కుల ప్రదీప్, బిజెపి మండల అధ్యక్షులు అంకం మహేందర్, రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, నాయకులు నాయిని సంతోష్, అనిల్ రావు ,రాజేందర్ పాల్గొన్నారు.