24లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి
14-07-2026 01:41 AM
కలెక్టర్ నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, జులై 13(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(సార్2026) ప్రక్రియను జూలై 24 లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అన్ని శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ పనులను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ జూలై 24లోగా తమ ఫారాలను సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (BLO) అందజేసి, ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.






