calender_icon.png 12 February, 2026 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

12-02-2026 02:07:13 AM

భూత్పూర్, ఫిబ్రవరి 11 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు నంబర్ 9 లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ నిర్వహణను పరిశీలించారు. వార్డు నంబర్ 10లోని ఉర్దూ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను సమీక్షించారు. వార్డు నం బర్ 6 అమిస్తాపూర్ ప్రాథమిక పాఠశాలలో,  వార్డులు 5 , 6 పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.