అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): ఓటరు జాబితాలో బతికున్నవారి ఓట్ల తొలగింపు.. మరణించినవారి ఓట్లు యథాతథం. జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి మాట్లాతు డివిజన్ల మ్యాపింగ్ పేరుతో అన్ని డివిజన్లలో చేపడుతున్న సర్వే లోపభూయిష్టంగా ఉందని, దానికి ప్రధాన కారణం సంబధిత అధికారుల నిర్లక్ష్యమేనని, దాని పర్యవసానమే డివిజన్లలో ఓట్ల గల్లంతు జరిగిందని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి అన్నారు కరీంనగర్ లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేపట్టిన మ్యాపింగ్ సర్వే వద్ద ఘాటుగా విమర్శించారు.
ఆయా డివిజన్లలో బూత్ లెవెల్ ఆఫీసర్ లు పని చేస్తున్నట్టు కనిపించడం, కానీ బి.ఎల్.ఓ లు డివిజన్ లో గడప గడపకు తిరగకుండా స్థానిక కార్పొరేటర్ కనుసన్నుల్లో ఒకే స్థానంలో కూర్చుని ఓట్ల మ్యాపింగ్ చేస్తున్నట్టు తప్పుడు నివేదికలు తయారు చేయడంతోనే డివిజన్లలోని ఓట్లు గల్లంతు అవుతున్నాయని, ఈ ఓట్ల గల్లంతు విషయంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ముందు వందల సంఖ్యలో పిర్యాదులు వచ్చిన వాటిని పరిష్కరించకపోవడంతోనే నేడు భారీగా పోలింగ్ శాతం తగ్గిందని, దీనికి ప్రధాన కారణం బి.ఎల్.ఓ లు వారి పై ఆధారపడుతున్న జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లే భాద్యులని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు.
ఓటరు జాబితాలో మరణించినవారి ఓట్లు యధాతథంగా ఉండడం, కానీ బ్రతికున్నవారి ఓట్లు తొలగించడం ఎంత పెద్ద నేరమో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ గమనించాలని పేర్కొంటూ, అలాగే డివిజన్ లో ఒక ఇంటిలో ఉన్న నాలుగు ఓట్లు నలుదిక్కుల నాలుగు ఇతర డివిజన్లలో బదిలీ కావడం, ఇతర గ్రామాలలోని ఓట్లు డివిజన్లలో దొంగ ఓట్లు నమోదు చేపించడం, డబుల్ ఓట్లు రావడం, అలాగే ఓటరు జాబితాలో పేరు ఒకటి, ఫోటో మరొకటి ఉండటం లాంటి ఎన్నో తప్పులు దొర్లాయని,
ఈ తప్పులకు ప్రధాన కారకులుగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయ లోపంతో జరిగిందని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా ఆరోపణలు చేశారు. అందుకే రాష్ట్రంలో ఆధార్ కార్డు ఓటరు కార్డుతో లింక్ పెట్టే స్పెషల్ఇంటెన్సివ్ రివిజన్ “సర్” నిబంధన కఠినతరం చేయాలని, అప్పుడే దొంగ ఓట్లకు, డబుల్ ఓట్లకు చెక్ పడే అవకాశం ఉంటుందని, లేనిపక్షంలో తెలంగాణలో సర్ నిబంధనను అమలు చేసే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జనసేన పార్టీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.




