calender_icon.png 17 December, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 57.91 శాతం నమోదు

17-12-2025 12:21:34 PM

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. బుధవారం 182 మండలాల్లోని 3,752 గ్రామ పంచాయతీలలో జరిగిన చివరి దశ పోలింగ్ లో ఉదయం 11 గంటల వరకు సుమారు 57.91 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల పొడవైన బారులు తీరారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. సంబంధిత జిల్లాలోని పోలీసు శాఖ, పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సజావుగా జరిగేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది.