28 May, 2026 | 3:48 AM

అమ్మకోసం ఎదురుచూపులు

28-05-2026 02:10 AM

ఇద్దరు బిడ్డలను ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన కన్న తల్లి

బాన్సువాడ, మే 27 (విజయక్రాంతి): తన ఇద్దరు బిడ్డలను ఆస్పత్రిలో వదలి వెళ్లిపోయిందో కన్నతల్లి. అమ్మ రాకకోసం రెండు రోజులుగా ఆ పిల్లలు దిగాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన కన్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ తులశ్రీధర్ తెలిపిన వివరా ల మేరకు మద్నూర్ మండలం చిన్న ఎక్లారా స్వగ్రామం లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్దామని సోమవారం సాయంత్రం బాన్సువాడ పట్టణంలో ని ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. రాత్రి సమయంలో డబ్బులు పోయాయి, తీసుకొస్తానని ఇద్దరు పిల్లలకు చెప్పి వెళ్లిపోయింది. ఆమె రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పిల్లలను బాన్సువాడ పోలీస్‌స్టేషన్‌కి తీసుకొని వచ్చారు. అనంతరం పోలీసులు ఐసీడీఎస్ శాఖకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు.