బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
ముకరంపుర, మే 27 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నియామకపు ఉత్తర్వుల ప్రకటన విడుదల చేసింది.
ప్రవీణ్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చిన్న పాపయ్య పల్లె గ్రామం గతంలో ఏబీవీపీ నందు పది సంవత్సరాలు పూర్తి సమయం కార్యకర్తగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేవైఎంలో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొంది నేడు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా నరెడ్ల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ,కేంద్రమంత్రి బండి సంజయ్ ,జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి కి , తన నియమకానికి సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేవైఎం బలోపేతానికి కృషి చేస్తూ,రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్ధి,నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగడతూ యువత పక్షాన కొట్లాడుతానని,యువతకు బీజేవైఎం పరంగా అండగా ఉంటామన్నారు.






