కూలిన గోడ ... తప్పిన ప్రమాదం
01-09-2025 11:26 AM
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం(Ellanthakunta mandal) గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లి గ్రామంలో జుట్టు పోచయ్యకు చెందిన ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో గోడ వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం వర్షాలకు ఇంటి పైన కవర్ కప్పినప్పటికీ గోడలోకి వర్షం నీరు వెళ్ళటంతో పూర్తిగా నానిపోయి గోడ ఒక్క సారిగా పడిపోయినట్లు పోచయ్య తెలిపారు. దీనిపై స్థానిక పంచాయతీ కార్యదర్శి ని వివరణ కోరగా గతంలో ఒకసారి వర్షాలకు కూలితే దాన్ని బాగు చేపించుకున్నారని, గోడలు నాని ఉండడంతో రెండు రోజుల క్రితం మరోసారి గోడ కూలిందని, ఉన్నతాధికారులకు తెలిపి బాధిత కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.






