calender_icon.png 1 September, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు బిల్లులకు శాసనమండలి ఆమోదం

01-09-2025 11:23:32 AM

శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.

హైదరాబాద్: శాసనమండలి నిరవధిక వాయిదా(Legislative Council adjourned) పడింది. మూడు బిల్లులకు శాసనమండలి ఆమోదం(Telangana Legislative Council) తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లుకు మండలి సోమవారం ఆమోదం తెలిపింది. మండలి ముందుకు అల్లోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లును మంత్రి దామోదర(Minister Damodar Raja Narasimha) ప్రవేశ పెట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మంత్రి దామోదర బిల్లును ప్రవేశపెట్టారు.

అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లుకు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutha Sukender Reddy) ఆమోదించారు. తెలంగాణ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్‌ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన చేశారు.. కాళేశ్వరం నివేదిక కాపీలను చించిన ఎమ్మెల్సీలు మండలి చైర్మన్‌పైకి విసిరారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు.