calender_icon.png 30 January, 2026 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీల వాల్ పోస్టర్ విడుదల

30-01-2026 07:22:05 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో ఫిబ్రవరి 12వ తేదీన సింగరేణి క్లాసిక్ బాడీ బిల్డింగ్ పేరుతో నిర్వహించనున్న నాలుగు జిల్లాల స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ పోటీల వాల్ పోస్టర్లను బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ విడుదల చేశారు. శుక్రవారం ఆయన చాంబర్ లో బాడీ బిల్డింగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు.

తెలంగాణ బాడీ బిల్డర్స్ ఫిజిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల క్రీడాకారులకు నిర్వహించే ఈ పోటీలు సింగరేణి కళావేదికలో జరుగుతాయి. ఈ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు 9059540130 మొబైల్ ను సంప్రదించాలని స్కైజిమ్ నిర్వాహకులు పి.సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కై జిమ్ సభ్యులు పాల్గొన్నారు