30-01-2026 07:24:46 PM
సిద్దిపేట క్రైం: ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన నలుగురికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు రూ.41వేలు జరిమానా విధించారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆరుగురికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.30 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.