calender_icon.png 30 January, 2026 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 నెలల్లో రైల్వే బ్రిడ్జి వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తాం

30-01-2026 07:19:52 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి):  జిహెచ్ఎంసి ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన విషయమై మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో కాంట్రాక్టర్ సత్తిరెడ్డి, ఆర్ అండ్ బి ఏఈ  సింధు ప్రియా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైల్వే వంతెన సంబంధిత కాంట్రాక్టర్ సత్తిరెడ్డి మాట్లాడుతూ రైల్వే వంతెన విషయంలో గత కొద్దీ రోజుల క్రితం మన డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలవడం జరిగింది.

వారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసి నిధుల విషయంపై చర్చిస్తామని, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 20వ తేదీ తరవాత నిధులు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేను పనులు నిలిపివేయడం లేదని శివారెడ్డిగూడా లో నిర్మిస్తున్న వంతెన పనుల కోసం సంబంధించిన పరికరాలు తీసుకోని వెళ్తున్నానని, 3 నుండి 4 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తానని తెలిపారు.

ఈసందర్బంగా మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్  మాట్లాడుతూ... వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలందరూ అనేక సంవత్సరాల నుండి ఎంతో ఓపికతో ఉన్నారని, ఇంకో 3 నుండి 4 నెలల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్  తెలిపారన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, రైతు సొసైటీ మాజీ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు, మాజీ వార్డు సభ్యులు సుధాకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, సీనియర్ నాయకులు జావీద్, సిరాజ్, ఖయ్యూం, మొయినార్టీ అధ్యక్షులు ఫరూక్, యూత్ వైస్ ప్రసిడెంట్ రఫీ, సల్మాన్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.