19 May, 2026 | 6:16 AM

నేటి నుండి ‘యువ ఆపద్ ధర్మ’ ఎన్‌సీసీ క్యాడెట్‌లకు వారం రోజులపాటు శిక్షణ

19-05-2026 12:00 AM

నల్లగొండ టౌన్, మే 18 : నేటి నుండి యువ ఆపద్ ధర్మ ఎన్ సి సి క్యాండెట్ లకు ఎన్ సి సి 31వ బెటాలియన్ నల్ల గొండ, ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వారం రోజులపాటు శిక్షణ ఇవ్వను న్నారు విపత్తుల నిర్వహ ణలో ఎన్ సి సి క్యాడెట్ల పాత్ర, సమాజాన్ని సమాయత్త పరచడానికి కావలసిన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 మంది ఎన్ సి సి క్యాడెట్లుతోపాటు, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ విభాగాల 50 మంది క్యాడెట్లు సైతం ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారని 31 బెటాలియన్ టీఎం లక్షారెడ్డి, కళ్ళం శ్రీధర్ రావు, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లను సుబేదార్ మేజర్ మాధవరావు, కొమ్ము మల్లయ్య ఆర్మీ ఆఫీసర్ తో పాటు ఎన్ సి సి ఆఫీసర్ డాక్టర్ మశ్చీందర్ లు పర్యవేక్షించారు .