21 July, 2026 | 12:02 PM

ఎంజీఎంను సందర్శించిన వరంగల్ సీపీ

21-07-2026 01:54 AM

హనుమకొండ, జూలై 20(విజయ క్రాంతి): ఎంజీఎం హాస్పిటల్ ను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సందర్శించారు. యం.జి. యంకు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ అవుట్ పోస్ట్ సందర్శించి సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఇక్కడికి వచ్చే మెడికో లీగల్ కేసులకు సంబంధించి ఏవిధమైన చర్యలు చేపడుతున్నారు, వీటికి సంబందించి  వివరాలను నమోదు చేసే రికార్డులను పరిశీలించారు.

అనంతరం మత్తు పదార్ధాలకు బానిసలుగా మారిన యువతకు చికిత్స అందిస్తున్న డీ అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో  మత్తు పదార్ధాలకు అలవాటు పడిన యువతను సాధరణ స్థితికి తీసుకవచ్చేందుకు వైద్యులు అందిస్తున్న చికిత్స విధానాన్ని వైద్యులు పోలీస్ కమిషనర్ కు వివరించారు.ఈ సందర్బంగా యం.జి.యం పరిసరాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ హాస్పటల్ కు సంబందించి ప్రధాన మార్గంతో పాటు, వాహన పార్కింగ్ ప్రదేశాలు,ముఖ్యమైన  స్థలాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై సంబందించిన అధికారులకు పలు సూచనలు చేయడంతో పాటు, యం.జి.యం లో పార్కింగ్ ఏర్పాట్లు,

హాస్పిటల్ సంబందించి ప్రధాన మార్గం నుండి హాస్పటల్ కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్పటల్ ప్రధాన ద్వారంలో ఆటోలను నిలపకుండా తీసుకోవాల్సిన చర్యలపై  ట్రాఫిక్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత,యం.జి.యం సూపరింటెండెంట్ రాంకుమార్ రెడ్డి, ఏసీపీలు జితేందర్ రెడ్డి, సదయ్య, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి ఇన్స్ స్పెక్టర్లు కరుణాకర్, రాఘవేందర్ తో పాటు ఆర్.ఎస్.ఐలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్, నాగరాజు తదితరులున్నారు.