08-02-2026 01:49:09 AM
7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎ శ్రీదేవి
భూత్పూర్, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు నన్ను దీవించి గెలిపిస్తే ఐదు సంవత్సరాల పాటు సేవకురాలుగా పని చేస్తానని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎ. శ్రీదేవి అన్నారు. శనివారం భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీదేవి మాట్లాడుతూ నన్ను దీవించి గెలిపిస్తే వార్డును అద్భుతంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మాటల గారడీతో మోసం చేస్తున్నారని ప్రజలు నమ్మొద్దన్నారు. ఈసారి పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి తమను గెలిపిస్తే వార్డు ను అన్ని విధాలుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారాలతో వార్డును అభివృద్ధి చేస్తామన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించి చేతు గుర్తుకు ఓటు వేసి దీవించి గెలిపించాలని ఆమె అన్నారు.
ఆడబిడ్డగా నన్ను ఒకసారి ఆశీర్వదించి మీ అమూ ల్యమైన ఓటు వేసి మీ ఆడబిడ్డగా మీ ముం దుకు వస్తున్న నన్ను దీవించి గెలిపించాలం టూ ఏడవ వార్డు ఓటర్లకు తెలిపారు. 7వ వా ర్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మీ ముందు ఉంచుతానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.