calender_icon.png 8 February, 2026 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బధిర విద్యార్థులకు ఆటల పోటీలు

08-02-2026 01:50:12 AM

హెలెన్ కెల్లర్స్ ఇనిస్టిట్యూషన్స్‌లో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలెన్ కెల్లర్స్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఈ నెల 5, 6, 7వ తేదీలలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించినారు. జూనియర్ బధిర విద్యార్థులకు కోకో, కబడ్డీ, టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, గేమ్స్ లను నిర్వహించారు.  సీనియర్స్‌కు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఐబీఎం కార్పొరేట్ సంస్థ వారు బహుమతులను అందజేశారు.

ముఖ్యఅతిథిగా ఐబీఎం సీనియర్ మేనేజర్ అనిల్ అనిల్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ ప్రసాద్, భవన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ హెలెన్ కెల్లర్స్ స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ పటాన్ ఉమర్ ఖాన్, డాక్టర్ ఆరుముగం డాక్టర్ శశిధర్ రెడ్డి, ప్రొఫెసర్ అంజయ్య, శ్రీధర్, శ్రీనివాస్, శైలజ, లెనిన్ బాబు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంస పత్రాలను ఈ నెల 14న 41వ ఫౌండేషన్ రోజు అందజేస్తారు.