17-01-2026 07:44:16 PM
– డ్రా పద్దతిలో మహిళ రిజర్వేషన్లు నిర్దారించిన జిల్లా కలెక్టర్
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు వార్డుల వారిగా రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఖరారు చేసారు. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలక్షన్ అథారిటీ అధికారి ఆదేశానుసారం సామాజిక వర్గాల వారిగా దామాశా పద్దతిలో రిజర్వేషన్లను నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. కాగా ఏఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వర్తిస్తుంది అన్నది జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా ప్రతిపాఠి ఆధ్వర్యంలో డ్రా పద్దతిలో నిర్ణయించారు.
దమాశా పద్దతిలో 50 శాతం రిజర్వేషన్లు వర్తించేలా ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లను నిర్దారించారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఎస్టీ జనరల్‌కు ఒక స్థానం, ఎస్సీ జనరల్‌కు రెండు, ఎస్సీ మహిళకు ఒక స్థానాన్ని కేటాయించారు. బీసీ జనరల్‌కు ఏడు, బీసీ మహిళలకు ఏడు స్థానాలు, ఓసీ మహిళలకు పది స్థానాలు, జనరల్‌కు ఎనిమిది స్థానాలను కేటాయించారు. మొత్తం 36 వార్డుల్లో 18 స్థానాలు మహిళలకు వచ్చేలా రిజర్వేషన్లను ఖరారు చేసారు.
ఎస్టీ (జనరల్) : 2వ వార్డు
ఎస్సీ (జనరల్) : 4, 30వ వార్డులు
ఎస్సీ (మహిళ) : 8వ వార్డు
బీసీ (జనరల్) : 7, 10, 14, 18, 23, 24, 25వ వార్డులు
బీసీ (మహిళ) : 1, 6, 17, 20, 22, 27, 28వ వార్డులు
ఓసీ (నాన్ రిజర్వ్‌డ్) : 9, 11, 13, 26, 31, 32, 34, 35వ వార్డులు
ఓసీ (మహిళ) : 3, 5, 12, 15, 16, 19, 21, 29, 33, 36వ వార్డులుగా ఖరారు చేశారు.