calender_icon.png 17 January, 2026 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు దుప్పట్లు పంపిణీ

17-01-2026 07:55:32 PM

కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య పాస్టర్

కోదాడ: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండలోని సుందరయ్య కాలనీలో నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో శనివారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. హైదరాబాదు నుంచి వచ్చిన ఏనుష్ రాజు ప్రజల యొక్క ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు గర్భిణులకు మంచి ఆరోగ్యం కల్పించే విధంగా ఆహారం తీసుకోవాలని చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అంటువ్యాధుల నివారించాలని అన్నారు.

ఈ సందర్భంగా యేసయ్య మాట్లాడుతూ... సుందరయ్య కాలంలోని ప్రజలు ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకొని అనుకోకుండా వచ్చే వ్యాధులను నిర్మూలించడానికి వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత వంటగదిలో శుభ్రత మంచినీరు త్రాగే విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా చలికాలం సరి తీవ్రంగా ఉన్నందున మీటింగ్లో పాల్గొన్న స్త్రీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొజ్జ గోపి, సీనియర్ క్రైస్తవ నాయకులు ఏజే సామ్యూల్ ప్రభుదాస్ రాజేష్ శాంతవర్ధన్ చంద్రకాంత హరిగోన్స్ విజయ లక్ష్మి మాధవి తదితరులు పాల్గొన్నారు.