చూస్తున్నది ట్రైలరే!

28-04-2024 01:17:39 AM

n విపక్షాలకు 70 ఎంఎం సినిమా చూపిస్తాం

n మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు లేదు

n ఎన్నికల ప్రచారంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని.. వీటికే భయపడుతున్న విపక్షాలకు రాబోయే రోజుల్లో 70 ఎంఎం సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం ముత్తారం మండలంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ముత్తారంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించి ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతామన్నారు. అభివృద్ధిపై కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ, బీఆర్‌ఎస్‌కు లేదని పేర్కొన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

యువకుడైన గడ్డం వంశీకృష్ణను ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ.. పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాకా), మాజీ స్పీకర్ శ్రీపాదరావు ఆశీస్సులతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇప్పటికే తాను సొంతంగా పెద్దపల్లి నియోజవర్గంలో 500 మందికి ఉపాధి కల్పించానని తెలిపారు. అనంతరం ముత్తారంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్‌రావు దంపతులు స్వామివారికి చేయించిన రూ.8 లక్షల విలువైన వెండి కిరీటాన్ని వారి చేతులమీదుగా ఆలయ బాధ్యులకు అందజేశారు. 

హామీ మేరకు రోడ్డు వేయించాను..

మచ్చుపేట గ్రామంలో మంత్రి ప్రచారం నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ..  ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మచ్చుపేటలోని బగుళ్లగుట్టకు రూ.2 కోట్లతో సీసీ రోడ్డు నిర్మిం చామని తెలిపారు. అలాగే ముత్తారం మధ్య రూ.30 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేయించామని, ముత్తారేొంగంగాపూరి వరకు రోడ్డు నిర్మించేందుకు రూ.50 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

ఓడేడు బ్రిడ్జి నిర్మాణంలో తలెత్తిన లోపాలకు సంబంధించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బా బు తెలిపారు. ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి మానేరులో బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇం జినీర్లను కాదని మానేరుపై కేసీఆర్ సొంత తెలివితో బ్రిడ్జి నిర్మించారని.. అందుకే ఈ బ్రిడ్జి పరిస్థితి ఇలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై ఇప్పటికే సీఎం రేవం త్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండ్రు రమాదేవి, నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, చొప్పరి సదానందం, నాగినేని జగన్మోహన్‌రావు, దొడ్డ బాలాజీ, ప్రసాద్, అల్లాడి యాదగిరిరావు, ముసుకుల సురేందర్ రెడ్డి, దచె శశిభూషణ్, దొడ్డ గీతారాణి,  జీ పద్మ, సిరికొండ బక్కా రావు, తూటి రజీత రఫి తదిరతులు పాల్గొన్నారు.