15 June, 2026 | 9:28 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

గురుకుల్ కళాశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం

04-11-2025 06:40 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ గురుకుల్ కళాశాలలో గురుకుల పరిరక్షణలో భాగంగా గురుకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్  సహకారంతో ఓ.ఎన్.జి.సి వారి సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ను తన సొంత ఖర్చులతో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గురుకుల్ కళాశాలలో దాన్ని మరమ్మత్తు చేసి మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, జేఏసీ కన్వీనర్ మారo లక్ష్మారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించడం జరిగింది.

విద్యార్థులు సేవ్ గురుకుల్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గురుకుల్ పరిరక్షణ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించి త్వరలో విద్యార్థులకు అందుబాటులో వచ్చేటట్టు చేస్తామని తెలిపారు. తన సొంత ఖర్చుతో గురుకుల్ రైల్వేగేట్ ప్రహరీగోడ అసంపూర్తిగా మిగిలి ఉన్నందున అది పూర్తి చేయుటకు తన సొంత గ్రామమైన ఘట్ కేసర్ కి శ్రేయోభిలాషి కందకట్ల మాధవరెడ్డి ఇనుప కంచె పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గురుకుల్ పరిరక్షణ సమితి సభ్యులు, శ్రేయోభిలాషులు, విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.