calender_icon.png 4 November, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

04-11-2025 06:38:24 PM

కాటారం (విజయక్రాంతి): పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించాలని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి పాడి రైతులకు సూచించారు. కాటారం మండలం దేవరాంపల్లి, రేగుల గూడెం గ్రామాలలో పశు వైద్యాధికారులు డాక్టర్ ధీరజ్, రమేష్ లతో కలిసి సుమారు 125 గేదెలకు, 74 గోజాతి పశువులకు టీకాలు వేశారు. మండలంలోని ప్రతి గ్రామంలో పాడి రైతులు తప్పనిసరిగా తమ పాడి పశువులకు ప్రభుత్వం ద్వార ఉచితంగా అందించే గాలికుంట టీకాలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులు తుంగల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.