calender_icon.png 4 November, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేగం వద్దు ప్రాణం ముద్దు

04-11-2025 06:48:19 PM

డీసీపీ భాస్కర్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): వాహనదారులందరికి వేగం వద్దు ప్రాణం ముద్దు అని డీసీపీ భాన్కర్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన నదస్సుకు ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డిసిపి భాస్కర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో చాలా కుంటుంబాలు రోడ్డున పడ్డాయని, జిల్లాలో ఇప్పటికి 142 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. వాహనదారులు నిభంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్క వాహనానికి దృవీకరణ పత్రాలు, లైసెన్సు, ఇన్సురెన్స్ కల్గి ఉండాలన్నారు. కొన్ని రోడ్డు ప్రమాదాల సంఘటనలు చూసి నేను స్వయంగా కొన్ని పాటలు వ్రాసానని తెలిపారు.

చందామామ కన్న చక్కని మొహం నీది కొడుకా నన్నెలా విడిచిపోయావురా కొడుకా, రామ సక్కని కొడుకా నీవు డ్రగ్స్ కు ఎలా బానిసయ్యావురా అని పాటు వ్రాసి వాటి ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. యువత వ్యసనాలను బానిస కావద్దని భవిష్యత్తును వృధా చేసుకోవద్దని తెలిపారు. అతివేగంగా మధ్యం సేవించి వాహనాలను నడుతున్నారని అనుమతులు లేని వాహనాలను కొనుగోలు చేసి నడుపుతున్నారని ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాలలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేశామని వారి చేత కొన్ని ప్రమాదాలను నివారించేందకు చర్యలు తీసుకుంటున్నామాన్నారు. అనంతరం గ్రామ కమిటీ సభ్యులచే ప్రతిజ్న చేపించారు. శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అందిజేసిన హెల్మట్లను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపి ప్రకాష్, సీఐ రమణ మూర్తి, ఎస్సై సురేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.