ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వాటర్ ప్లాంట్ ప్రారంభం
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) పుట్టినరోజు సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో నూతన మంచినీటి వాటర్ ప్లాంట్ ను మాజీ సర్పంచ్ దోనూరి జైపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని, అది కేవలం ప్రజల మనిషి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవేనని అన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటడంతో ప్రత్యేక నిధులచే గ్రామ గ్రామాన బోర్లు వేయించి ప్రజల నీటి సమస్యను తీరుస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణలో స్థానం దక్కాలని ఆయన దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,మండల నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు,అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.






