calender_icon.png 12 September, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఎండి నుంచి కాకతీయ కెనాల్‌కు నీటి విడుదల

04-09-2025 12:09:41 AM

రైతులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుంది 

తిమ్మాపూర్ సెప్టెంబర్ 3 విజయ క్రాంతి: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్ని జలాశయాలు నిండుగా నిండుకున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు బుధవారం మండలంలోని ఎల్‌ఎండి ప్రధాన కాకతీయ కాలువ గేట్లను స్విచ్‌ఆన్ చేసి 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయ కెనాల్ కాల్వ ద్వారా చివరి ఆయకట్ట వరకు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వానలతో ప్రాజెక్టులు నిండాయని, రైతులు ఇక నీటి ఎద్దడి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సాగునీరు సమృద్ధిగా అందుతుండటంతో ఈ సీజన్లో పంటలు పుష్కలంగా పండుతాయనే నమ్మకాన్ని రైతుల్లో నింపారు. కార్యక్రమంలో ఎస్ ఆర్ ఎస్ పి ఎస్ సి రమేష్ అధికారులు నాయకులుపాల్గొన్నారు.