calender_icon.png 12 September, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైలాన్‌లో ఘనంగా అన్నదానం

04-09-2025 12:08:23 AM

నాగార్జునసాగర్ సెప్టెంబర్ 3: వినాయకచవితి నవరాత్రుల సందర్భంగా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని కొత్త బ్రిడ్జి వద్ద నెలకొల్పబడిన గణేశుడి మండపం వద్ద గణేష్ యూత్ కొత్త బ్రిడ్జి ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు.

ఈ  సందర్భంగా గణేష్ ఉత్సవకమిటి సభ్యులు పలువురు మాట్లాడుతూ.. అన్ని దానల కన్నా అన్నదానం గొప్పదని,ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ధన్యవా దాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాతరావు,వాల్య నాయక్,పుల్యా,శంకరయ్య, శ్రీను, అరుణ్ కుమార్, ఈశ్వర్, వినోద్, అశోక్, ప్రదీప్, జీవన్, సంతోష్, వెంకటేష్ ,పండు మరియు కొత్త బ్రిడ్జి యూత్ సభ్యులు పాల్గొన్నారు.