6 July, 2026 | 4:05 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

నేడు నీటి సరఫరాకు అంతరాయం

27-06-2024 01:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26(విజయక్రాంతి): నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లు స్కీమ్ ఫేజ్‌ఆ కోదండా పూర్ పంప్‌హౌస్‌లో రెండో పంపు ఎన్‌ఆర్‌వీ వాల్వ్ మరమ్మతులకు గురికావడంతో నేడు (గురువారం) నగరంలోని పలు ప్రాంతాలకు అత్యవసరం గా నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లోలోప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతుందని బుధవారం పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతున్నట్లు చెప్పారు. 

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

ఎన్‌పీఏ, మిరాలం, బాలాపూర్, మైసారం, బార్కాస్ భోజగుట్ట, ఆళ్లబండ, మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కపురికాలనీ, మహేంద్రహిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, మబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రిపురం, మీర్‌పేట్, బడంగ్‌పేట్, శంషాబాద్ ప్రాంతాలకు అంతరాయం ఏర్పడనుంది.