14 August, 2026 | 1:57 AM

గర్శకుర్తి మండలం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

14-08-2026 12:40 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, ఆగస్టు 13(విజయ క్రాంతి): గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గురువారం గర్శకుర్తి గ్రామస్తులు గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చొ ప్పదండి నియోజకవర్గం లోని గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని దశా బ్ద కాలంగా గ్రామస్తులు కోరుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో త ప్పకుండా గర్శకుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు.

గర్శకుర్తి గ్రామాన్ని చేనేత హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావును గర్శకుర్తికి ఆహ్వానించి ఇక్కడి చేనేత కార్మికులకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు , నాయకులు గుండ రాజేశం,చిప్ప చక్రపా ణి, దూస రాజమౌళి, అన్నాల్ దాస్ శ్రీనివాస్, కొలిపాక రాజు, తదితరులు పాల్గొన్నారు.