20-12-2025 12:58:52 AM
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం మున్సిపల్ పట్టణంలో పశు వైద్యాధికారి లేకపోవడంతో పాడి రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని శ్రీరంగవరం పశు వైద్యాధికారిణి కల్పనకు రైతులు మాజీ సర్పంచ్ కోర్వీ పోచయ్య మాజీ వార్డు సభ్యులు జిన్నారం కృష్ణ.పిఎసిఎస్ డైరెక్టర్ జీడిపల్లి భూపాల్ తదితరులు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు మరిగ్గాన్ని నరసింహ తదితరులు పాల్గొన్నారు.