calender_icon.png 20 December, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ సర్వీస్‌లో విశ్వసనీయతే ముఖ్యం

20-12-2025 01:00:17 AM

  1. నియామకాల్లో పారదర్శతకు ప్రాధాన్యం ఇవ్వాలి 
  2. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రంగారెడ్డి, డిసెంబర్ 19 (విజయక్రాంతి): పబ్లిక్ సర్వీస్ నియామకాల్లో సమగ్రత, నిజాయితీ, విశ్వసనీయత ముఖ్యమని, పారదర్శ తకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నైపుణ్యాలను సంపాదించుకోగలిగినప్పటికీ, నైతిక ధోరణి లేకపోవడం తీవ్రమైన సవాళ్లకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని రామోజీఫిల్మ్ సిటీలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించా రు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనడాన్ని తనకు దక్కిన గౌరవమని చెప్పారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని తెలిపారు. ఉద్యోగ నియామకా ల్లో పారదర్శకతకు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగ నియమాకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమన్నారు.

అంతకు ముందు దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్ల అధిగమించడానికి, అభ్య ర్థుల నైతిక ధోరణిని అర్థం చేసుకోవడానికి పీఎస్సీలు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. పౌర సేవకులుగా ఉపాధి కోరుకునే యువత అణగారిన, దుర్బర వర్గాల ప్రయోజనాల కోసం పనిచేయడానికి మొగ్గు చూపాలన్నారు. ‘మహిళల అవసరాలు, ఆకాంక్షలకు ప్రత్యేకించి సున్నితంగా ఉండాలి.

లింగ-భేదాల విషయంలో యూపీఎస్పీలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చెప్పారు. సాంకేతికత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను యూపీఎస్సీలు ముందుగానే ఊహిం చాలని, పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయాలని, అలాగే ప్రపంచపోటీని తట్టుకునే బృందాలను అభివృద్ధి చేయాలని ద్రౌపది ముర్ము సూచించారు. 

అనంతరం ఫిలిం సిటీలో వివిధ ప్రదేశాలను రాష్ట్రపతి సందర్శించారు. ఈ సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రి సీతక్క, యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్‌కుమార్ టీజీపీ ఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేష్ పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. దేశంలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె బొల్లారం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఫిలిం సిటీకి చేరుకున్నారు.