20-12-2025 12:56:33 AM
వనపర్తి, డిసెంబర్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అలివికాని, ఆచరణ సాధ్యం కాని 420హామీలు, 6గ్యారంటీలు ఇచ్చి అమలు చేయలేక ప్రజల తీవ్ర వ్యతిరేకతకు గురైనారని గట్టు యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిశ్శబ్ద విప్లవం ద్వారా ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీని,కె.సి.ఆర్ గారిని ఆదరించారని ఇది తట్టుకోలేని ఎమ్మెల్యే అసహనం తో ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేవిధంగా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 59మంది సర్పంచులను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రేవంత్ రెడ్డిది ప్రచార ఆర్భాటం: జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్
రేవంత్ ప్రజాధనాని తన ప్రచార ఆర్భా టం కోసం రూ 3 వేల కోట్లు దుబారా చేశారని అందాల పోటీలకు, తెలంగాణ సమ్మిట్, డిల్లీ పర్యటనలకు, ప్రజాపరిపాలన ప్రచారం కోసం, ఫుట్ బాల్ స్టేడియం కోసం ప్రజాధనాన్ని వాడి సంక్షేమ పథకాలు బంద్ పెట్టినా రని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆరోపించారు. కె.సి.ఆర్ హయాములో 135గ్రామ పంచాయతీలకు గాను 122పంచాయితీలు గెలిపించి ప్రజల హృదయాలలో నిలిచారని రేవంత్ పాలనలో వైఫల్యం చెందినందుకే 50శాతం పంచాయతీలకు పరిమితమైనారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు కె.సి.ఆర్ సుస్థిర పాలన నిరంజన్ రెడ్డి ప్రజాపాలన కోరుకుంటున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కొట్టుకుపోవడం ఖాయం
వనపర్తి ఎమ్మెల్యే ఎన్ని అరాచకాలు, ప్రలోభాలు, దౌర్జన్యాలకు పాల్పడినా ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి అండగా నిలిచి 59మంది సర్పంచులను గెలిపించినారని మాజీ ఎంపిపి కృష్ణా నాయక్ విమర్శించారు. బి.ఆర్.ఎస్ సర్పంచులను గేటు తొక్కనీయని అంటావా నిన్ను గేటు బయటికి మెడ పట్టి గెంటే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఘనపురం మండలం జనరల్ బాడీ సమా వేశంకు అన్ని పథకాలు అమలు చేసిన తరువాతనే రావాలని డిమాండ్ చేశారు. జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, పెబ్బర్ మున్సిపల్ వైస్ చైర్మెన్ కర్రీస్వామి, నాయకులు రాళ్ళ కృష్ణయ్య, ఎద్దుల సాయి కుమార్, స్టార్ రహీమ్ రహీమ్, జోహెబ్ హుస్సేన్ చిట్యాల రాము, రామకృష్ణ పాల్గొన్నారు.