03-12-2025 12:00:00 AM
మంచి సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి
కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభం
హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అమలు చేయాలన్న తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆకాంక్షను రాష్ట్రంలోని ప్రజా ప్రభు త్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మంగళవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఆయన ప్రారంభించా రు.
ఈ సందర్భంగా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సా ధన ఉద్యమానికి పునాది పడిన పాల్వంచ లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం గర్వకారణమన్నారు. దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్స్ వర్సిటీ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పా రు.
రాష్ట్రానికి వెలుగును అం దించే థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ప్రాంత ప్రజలు వేలాది ఎకరాలను భూములను ధారాదత్తం చేస్తే, ఆనాటి పాలకులు స్థానికులను విస్మరించి ఆంధ్ర వలస వాదులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమానికి పునాది పడిందని గుర్తు చేశారు. అందుకు ప్రతిఫలంగా ప్రపంచంలోనే పాల్వంచ పేరును అగ్రభాగంలో నిలపాలని దేశంలో ఎక్కడా కూడా మన్మోహన్ సింగ్ పేరు పెట్టకముందే పాల్వంచలో ఏర్పాటు చేస్తున్న ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయానికి పెట్టినట్టు స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న భారతదేశానికి ప్రధానిగా బాధ్యత చేపట్టి, అభివృద్ధి పథంలో ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఈ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను వెలికి తీసి ప్రపంచ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతోనే పాల్వంచలో ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పా టు చేశామన్నారు. ఖమ్మం జిల్లా అంటే కాం గ్రెస్‌కు కంచుకోటాని, నేటి ప్రజా పాలన ఏ ర్పాటుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అండగా నిలిచారన్నారు.
ప్రపంచస్థాయికి వర్సిటీ: భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని చెప్పారు. త్వరితగతిన యూనివర్సిటీని అందుబాటులోకి తీసు కొచ్చి ఈ ప్రాంతంలోని అపార ఖనిజ సంపదపై పరిశోధనలు చేసే స్థాయికి తీసుకెళ్తామ ని పేర్కొన్నారు. భూమి పూజ చేసుకున్న దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డింగులు, సకల సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా భూమి, భూమి లోపల ఉన్న పొరలు, భూమి లోపల ఉన్న ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాల పైన పరిశోధనలు చేయడమే కాకుండా తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అం దించే అద్భుత కార్యక్రమానికి, అత్యున్నత యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టామన్నారు.
యూనివర్సిటీతో దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మంత్రి తు మ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ విశ్వవి ద్యాలయాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరఫున సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ.. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేసిన ఆ నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజక వర్గంపై ప్రత్యేకమైన ప్రేమతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న, ఎర్త్ యూనివ ర్సిటీని ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకి టి శ్రీహరి, ఎంపీలు రామసహాయం రఘురామారెడ్డి, పోరిక బలరాం నాయక్, అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ పోదేం వీరయ్య, ఎ మ్మెల్యేలు పినపాక పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్టారాగమయీ, తెల్లం వెంకట్రావు, రామ్ దాస్ నాయక్, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్‌లు విద్యా చందన, వేణుగోపాల్, ఆర్డీఓ మధు, ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు పాల్గొన్నారు.
మంత్రులతో కలిసి పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోండి
రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని సీఎం రేవంత్ అన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఓటనే ఆయుధంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్లపాటు రాష్ట్రం నిర్లక్ష్యానికి గురై, చేపట్టిన ప్రాజెక్టులు పొలాలకు నీరు అందించలేదన్నారు.
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో మాత్రం కాసుల వర్షం కురిసిందని ఆరోపించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను పొలాలకు మళ్లించి శ్యామలం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మంత్రులతో కలిసి పనిచేసే అభ్యర్థులను ఎన్నుకొని, గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి లో అగ్ర భాగంలో నిలిపేందుకు అవసరమైన నిధులను సహచర మంత్రుల సహకారంతో సమకూరుస్తామని హామీ ఇచ్చారు.